45 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత 

45 quintals of ration rice tillageనవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ  చేసి తరలించేందుకు యత్నించిన నిర్వహకులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి పోలీసుల సాయంతో పట్టుకున్నట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు శుక్రవారం తెలిపారు. దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో మోతె శ్రీనివాస్, నూనె ప్రశాంత్, చింతల రవి, వీబూది సలీమ్, వీబూది సాయి ఐదుగురు కలసి ఆటోల యందు ఎలాంటి ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం విక్రయించేందుకు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, సిబ్బంది, దుబ్బాక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుమారు 45 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమ రవాణాదారులపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.