– పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు..
నవతెలంగాణ డిచ్ పల్లి: గత నెల 28న అకాల వడగళ్ల వానకు డిచ్ పల్లి మండలం లోని ముల్లంగి, బర్దిపూర్, ఆరెపల్లి గ్రామాల్లో పత్తి పంట నష్టం వాటిల్లిందని నిజామాబాద్ ఎడిఎ ప్రదీప్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు తెలిపారు. సోమవారం ముడు గ్రామాలలో నష్టపోయిన పంటలను రైతులతో కలిసి క్షేత్ర స్థాయికి వేల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 28న వడగళ్ల అకాల వడగళ్ళ వానకు ముల్లంగి, బర్దిపూర్, ఆరేపల్లి గ్రామాలలో ప్రత్తి పంటకు తివ్ర జరిగిందని, ఎకరాల వారిగా నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదికను అందజేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.వారి వెంట సర్పంచ్, ఎంపిటిసి నర్సయ్య,ఎఈవో భావన, రైతులు తదితరులు పాల్గొన్నారు.