యెస్‌ బ్యాంక్‌ లాభాల్లో 47 శాతం వృద్థి

ముంబయి : ప్రయివేటు రంగంలోని యెస్‌ బ్యాంక్‌ 2024-25 జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో 46.7 శాతం వృద్ధితో 502 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.343 కోట్ల లాభాలు నమోదు చేసింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తోన్న ఈ బ్యాంక్‌ గడిచిన క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 12.2 శాతం పెరిగి 2,244 కోట్లకు చేరింది. 2023-24 ఇదే క్యూ1లో రూ.2,000 కోట్ల ఎన్‌ఐఐ ప్రకటించింది. క్రితం క్యూ1లో బ్యాంక్‌ మొండి బాకీలకు కేటాయింపులు 41.2 శాతం తగ్గి రూ.212 కోట్లకు పరిమిత మయ్యాయి. ఏడాదికేడాదితో పోల్చితే అడ్వాన్సులు 14.7 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు 2 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గగా.. నికర ఎన్‌పీఏలు 1 శాతం నుంచి 0.5 శాతానికి దిగివచ్చాయి.