4795 పిల్లలకు పోలియో చుక్కలు

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో పోలియో ఇమ్యునైజేషన్ (NID-2024) కార్యక్రమంలో ఆదివారం నిర్వహించారు. ప్రాథమిక కేంద్రం అధ్వర్యంలో సుమారు 4995 మంది పిల్లలకు 0-5 సంవత్సరాల లోపు పోలియో చుక్కలు వేయవలని టార్గెట్ ఉండగా అందులో ఒక రోజు 4795 మందికి వేశామని తెలిపారు. 39 పోలియో చుక్కల కేంద్రాలు, ఒక మొబైల్ టీం ద్వారా హై రిస్క్ ఏరియా లయన్ ఇటుకబట్టిలు, కాన్సన్ ట్రక్షన్ ఏరియాల్లో సందర్శించి పోలియో చుక్కలు వేశమన్నరు. డబ్లూ ఎచ్ ఓ కన్సల్టెంట్ ప్రదీప్, అబ్జార్ వైర్ శ్రీకాంత్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వలింటర్లు పాల్గొన్నారు.