
రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీలలో వెంకట్రావుపేట పాఠశాల విద్యార్థి బి. కీర్తి రాష్ట్ర స్థాయి పోటీలలో 4వ స్థానం సాధించడం హర్షణీ యం అని ప్రధానోపాధ్యాయు లు నయిమా కౌసర్ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసో సియేషన్, సిద్దిపేట జిల్లా యోగాసన అసోసియే షన్, వ్యాస మహర్షి యోగ సొసైటీ అసోసియేషన్ ఫోరం నిర్వహించిన రాష్ట్రస్థాయి సూర్య నమస్కా రాల పోటీలు సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాల లో నిర్వహించారు. ఈ పోటీలకు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ పాఠశాల లకు, అన్ని రకాల వయసు కలవారు పాల్గొన్నార ని అన్నారు. వెంకటరావుపేట జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు పాల్గొనగా బి. కీర్తి 568 సూర్య నమస్కారాలు చేసి రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలవగా టి. స్వామి 295, టి. భార్గవి 269, పి. అస్మిత, ఆర్. మధుప్రియ, బి. శివాని, ఈ ఐశ్వర్య 268 సూర్య నమస్కారాలు పూర్తి చేసి బంగారు పతకాలు సాధించారని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయు డు ఎనలేని కృషి, ఉపాధ్యాయుల సహకారం ఫలితంగా ఇంత గొప్ప అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయంపై పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిం చాలని కోరారు