– పనుల్లో నాణ్యత పాటించాలి
– అభివద్ధి కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ల పాత్ర కీలకం
– మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్
నవతెలంగాణ-తాండూరు
మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో పనులను తీసుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులను పూర్తి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ తాటికొండ స్వప్నపరిమల్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కాంటాక్ట్‌లతో ఆమె ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్‌లో ఇదివరకు టెండర్లను పూర్తిచేసిన సుమారు 5 కోట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కాంట్రాక్టర్లకు ఆమె ఆదేశించారు. అభివద్ధి కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ల పాత్ర కీలకమన్నారు. వార్డుల్లో అత్యవసరమైన చోట మురుగు కాలువలు, సీసీ రోడ్లు పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. పార్కుల అభివద్ధి కోసం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ మార్కుల అభివద్ధికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. త్వరలో ప్రభుత్వ పార్కులకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాంట్రాక్టర్లందరూ తీసుకున్న పనులను త్వరగా గతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, మున్సిపల్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.