ఐదేండ్లలో 5లక్షల ఉద్యోగాలు

– టాటా గ్రూపు చైర్మెన్‌ చంద్రశేఖరన్‌ వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే ఐదేండ్లలో తయారీ రంగంలో టాటా గ్రూపు 5 లక్షల ఉద్యోగాలను సృష్టించనుందని ఆ గ్రూపు చైర్మెన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. సెమీ కండక్టర్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌, బ్యాటరీ, సంబంధిత రంగాల్లో అధికంగా ఈ ఉద్యోగాలు రానున్నాయన్నారు. తయారీ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాల సృష్టి జరగకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారడం అంత సులువు కాదని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో సెమీ కండక్టర్‌, ప్రెసిషన్‌ మానుఫాక్చరింగ్‌, అసెంబ్లీ, ఎలక్ట్రిక్‌ వెహికల్‌, బ్యాటరీలు, సంబంధిత రంగాల్లో టాటా గ్రూపు పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించనుంద న్నారు. సెమీ కండక్టర్‌ వంటి తయారీ రంగాల్లో వచ్చే ప్రతీ ఉద్యోగానికి పరోక్షంగా 8-10 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయన్నారు.