తిమ్మాపూర్‌లో రూ.5 లక్షల పట్టివేత

నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఐదు లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. సీఐ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ అండర్‌ రైల్వే సమీపంలో వాహనాలు తనిఖీలు చేప ట్టారు. హైదరాబాద్‌ నుంచి చేగురు వైపు వెళ్తున్న వాహ నాన్ని తనిఖీ చేయగా రూ. ఐదు లక్షలు పట్టుబడ్డాయి. సదరు వ్యక్తి అట్టి డబ్బులకు ఎలాంటి రసీదు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకొని ఎలాక్టోరల్‌ రిటర్నింగ్‌ అధికారికి పంపించారు. ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.