రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి సంబంధించి 5 భాషల వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి గురువారం (స్వాతంత్య్ర దినోత్సవం), సోమవారం (రక్షా బంధన్) హాలీడేస్‌తో 5 రోజుల వీకెండ్ అడ్వాంటేజ్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీగా ‘డబుల్ ఇస్మార్ట్’ చుట్టూ బజ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. పోస్టర్‌లు, టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇది మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్. మేకర్స్ ప్రోమోలో ప్రామీస్ చేసినట్లు ఈ మూవీలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఐదు భాషలు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన’్‌ని అందించిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ చాలా గ్రాండ్‌గా ఐదు భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజరు దత్ పవర్ ఫుల్ పాత్ర పోషించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. అలీ, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, సీఈఓ: విషు రెడ్డి, సంగీతం: మణి శర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి, స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్.