– మంత్రి కొప్పులకు ఎన్‌పీఆర్‌డీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్‌పీఆర్‌డీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు కె.వెంకట్, ఎం అడివయ్యతోపాటు కోశాధికారి ఆర్ వెంకటేశ్ హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం రాత్రి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించా రు.స్వంత స్థలం కలిగిన నిరుపేదలకు ఇంటి నిర్మాణ ం కోసం రూ.3లక్షల ఆర్థిక సహాయం చేయటానికి గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందనీ, దీనిలో 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లను వికలాంగులకు అమలు చేయాలనే నిబంధనను పట్టించుకోలేదని తెలిపారు. ఆ చట్టం ప్రకారం గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు ఐదు శాతం రిజరేశ్వన్లు అమలు చేయాలని డిమాండ్ చేశా రు. జూన్ 21న రవాణా, రోడ్, భవనల శాఖ జివో 25ను విడుదల చేసిందనీ, ఇందులో కులాల వారిగా రిజర్వేషన్స్ అమలు చేయాలని పేర్కొన్నారని గుర్తు చేశారు.కానీ..వికలాంగులకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ల గురించి జీవో లేకపోవటం విచారకరమని తెలిపారు. 2016 ఆర్‌పీడీ చట్టానికి బిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం తగదని పేర్కొన్నారు. వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వికలాంగులకు దక్కాల్సిన రిజర్వేష న్లను అమలు చేయకుండా మోసం చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ మాత్రం తమకు ఏమి పట్టనట్టు వ్యవహరిసస్తున్నారని విమర్శించారు. వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ నిర్లక్ష్యం వల్ల వికలాంగులకు అందాల్సిన సౌకర్యాలు అందటం లేదని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు 2016 ఆర్‌పీడీ చట్టానికి తూట్లుపొడుస్తుంటే పర్యవేక్షించాల్సిన కమిషనర్ ఏమి పట్టనట్లు వ్యవహరించడం తగదని హితవు పలికారు. గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని నిబంధన ఉందనీ, దీని ప్రకారం వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వమే వికలాంగులకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5 శాతం రిజ్వేషన్లు అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారని తెలిపారు.