మండల ప్రజల అభీష్టం మేరకు ఎంపీపీగా ఎన్నికైన తర్వాత ఐదు సంవత్సరాలు సహకరించిన ఎంపీటీసీలకు, సర్పంచులకు, మండల అధికారులకు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీపీ, ఎంపీటీసీల వీడుకోలు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఒక్క ఎంపీటీసీ పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల కాలంలో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి శయశక్తుల కష్టపడినట్లు తెలిపారు. విద్యారంగ విషయంలో ఆశ్శేషమైన కృషి చేసి మండలంలో అధునాతన మార్పు చేపట్టినట్లు పేర్కొన్నారు. చేపట్టిన ప్రతి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ యాకనారాయణ, కోఆప్షన్ మెంబర్ అష్రాఫ్ పాషా, ఎంపీటీసీల మండల అధ్యక్షుడు ఐత రాంచందర్, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.