– మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలని మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ డిమాండ్ చేశారు. మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం కేంద్రంలో ముదిరాజ్ భవన్ వద్ద సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన మత్స్యకారులకు చట్ట సభల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులను విస్మరించిన పార్టీలను తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయ పార్టీలు మత్స్యకారులకు జనాభా ప్రాతిపదికన చట్ట సభలలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేనిపెస్టులో మత్స్యకారుల అంశాలను చేర్చాలని కోరారు. ప్రతీ మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంట్లలో రూ.10 లక్షల నగదు జమ చేయాలని, లేదంటే మత్స్యకారులు రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతారని తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేందుకు మత్స్య కార్మిక సంఘం 2001 అక్టోబర్ 21 ఏర్పడిందన్నారు. నాటి నుండి నేటి వరకు దేశ, రాష్ట్రంలోని అనేక పరిణామాలను, ఘటనలను ఎదుర్కొంటూ సంఘం ముందుకు పోతున్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, జిల్లా సహాయ కార్యదర్శి భోద్రమోని నర్సింహ్మా, ఇబ్రహీంపట్నం టౌన్ మహిళ సోసైటి అధ్యక్షురాలు సోప్పరి మంగమ్మ, మదాసు మయూరి, మజీద్ పూర్ సొసైటీ అధ్యక్షులు కావాలి నర్సింహ్మా, మహిళా సొసైటీ, అధ్యక్షురాలు కాగు లక్ష్మి, సువర్ణ, చనమోని బాలమణి, సోప్పరి అవంతి, వై బాల్ రాజ్, బాల గణెష్, మంజుల, జె రమాదేవి వసంత, కళామ్మ తదితరులు పాల్గొన్నారు.