కళయజ్ఞ పేరుతో హైదరాబాద్ టార్చ్ పునర్జీవ సంస్థ ఆధ్వర్యంలో 50 మంది చిత్ర కళాకారులు రెండు రోజుల యాత్రలో భాగంగా భూపాలపల్లి,పెద్దపల్లి రేందు జిల్లాల సరిహద్దు మానేరు పరివాహక ప్రాంతంలో ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి పంచాయతీ పరిధి సందరెల్లి పురాతన ఆలయాన్ని ఆదివారం,సోమవారం రెండు రోజులపాటు సందర్శించారు. అంతరించి పోతున్న ఆలయాల కళలను తమ చిత్రకళ ద్వారా ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ఇక్కడ సందర్శించినట్లు తెలిపారు.వారికి భోజన సదుపాయాలను తాడిచెర్ల గ్రామానికి చెందిన చిత్రకళ బ్రహ్మ శేషాబ్ర డైరెక్టర్ ఈ.రమేష్ కుమార్, వి.సత్యగ్యుడు వసతులు ఏర్పాటు చేశారు. ఇందుకు చిత్ర కారులు అతన్ని ఘంసంగా సన్మానించారు.