50 కేజిల బాహుబలి కేక్ కట్ చేసి ఐటీ మంత్రి జన్మదిన వేడుకలు

– పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ 
నవతెలంగాణ-రామగిరి
 కాంగ్రెస్ పార్టీ కమాన్పూర్ మండల కన్వీనర్ సయ్యద్ అన్వర్,మండల ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి, జిల్లా ప్రదాన కార్యదర్శి ఆడెపు రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 50 కేజీల బాహుబలి కేక్ కట్ చేసి సంబురాలు ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్బంగా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణితో పాటు ఆసుపత్రి లోని రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రీధర్ బాబు అభిమానులు హాజరయ్యారు.