50 కిలోల బియ్యం అందజేత

నవతెలంగాణ –  భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామంలో మర్రిపల్లి రాజు దశదినకర్మకు  మంగ జమాల్ లక్ష్మీ జ్ఞాపకార్థం , మంగ జమాల్ లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ చిన్నం శ్రీనివాస్ 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తన వంతు సహకారంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంగ నవీన్, సురేష్, అబ్బులు, శంకర్,  మహేష్, కరుణాకర్, రమేష్,  శ్రీకాంత్, విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.