
మండలంలోని ఊరటం గ్రామపంచాయతీ పరిధిలోని జంపంగవాయి (కొత్తూరు) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గజ్జల సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని బుధవారం ఊరట్టం గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ గారి ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించి, దశదినకర్మకు 50 కేజీల బియ్యం అందజేశారు. సంతోష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటి అధ్యక్షులు కోటే నరసింహులు, దేవులపల్లి రాజయ్య, రాంబాబు కడారి శేఖర్, నడిగోటి సురేందర్, జంపన్న, సోషల్ మీడియా ఇన్చార్జి రాజశేఖర్, నరసయ్య, సారయ్య, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.