
నవతెలంగాణ – కంఠేశ్వర్
చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని చక్రపాణి కోరారు.ఈ మేరకు గురువారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రవి కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు టీ. చక్రపాణి మాట్లాడుతూ.. దేశ జనగణనలో కులగనగార్పాలని, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీలకు 50 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టి అమలు చేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, రెండు లక్షల కోట్లతో బీసీ సంక్షేమ అభివృద్ధి కొరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, బడ్జెట్లో నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయించి ఉపాధి అభివృaద్ధికై ఖర్చు చేయాలని, సబ్సిడీ రుణాలు వృత్తిదారులకు అందించాలని, బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని, అన్ని జిల్లాల్లో బీసీ భవన్ లను నిర్మించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చి ప్రభుత్వానికి పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధా కుమార్, రమేష్ సాయి పాల్గొన్నారు.