
నవతెలంగాణ- బెజ్జంకి
మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో సుమారు 50 మంది కూలీలను ఏర్పాటుచేసి పనులు చేయించాలని జిల్లా డీఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ కార్యలయంలో పీడీ ఒబులేసుతో కలిసి పంచాయతీ కార్యదర్శులతో డీఆర్డీఓ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.గ్రామంలో నెలకొల్పిన నర్సరీలు,హర్టీకల్చర్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్రత గ్రామాలుగా కొనసాగించాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య తెలిపారు. ఎంపీడీఓ దమ్మని రాము,ఈజీఎస్ ఏఈ రాజబాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.