పార్ట్ టైమ్ లెక్చరర్లకు 50 వేల వేతనం ఇవ్వాలి : TG-AUPTA

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో మరియు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పని చేస్తున్న పార్ట్ టైం లె్చరర్లకు నెలకు రూ. 50 వేల వేతనం 12 నెలల పాటు ఇస్తామని ఎన్నికల ముందు తమ మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండు చేస్తూ 29-08-2024 గురువారం నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ (టీజీ ఆప్ట) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న ార్ట్ టైం టీచర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీజీ ఆప్ట ప్రతినిధులు మాట్లాడుతూ “జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల్లో పాసై, పీహెచ్డీలు చేసి యూనివర్సిటీలు మరియు అనుబంధ కళాశాలల్లో చాలి చాలని వేతనంతో, ఆరు నెలల వేతనంతో అరకొర జీవితాలు వెళ్లదీస్తున్న పార్ట్ టైం లెక్చరర్ల ఇబ్బందులను అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రూ.50 వేల వేతనం, 12 నెలల పాటు ఇస్తామని తమ మ్యానిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చేస్తూ ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారెంటీలను, అనేక హామీలను నెరవేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పార్ట్ టైం టీచర్లకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి నెలకు రూ. 50 వేల వేతనం 12 నెలల పాటు ఇవ్వాలని” విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీ ఆప్ట ప్రధాన కార్యదర్శులు డా.రవీందర్ గౌడ్, డా. నాగేంద్రం, డా.మంచాల లింగస్వామ, డా. ఏ.కొండల్, డా.బిక్షపతి, డా.కుమార్, డా. శ్రీలక్ష్మీ రెడ్డి, డా. రాజేష్, డా.ఎస్.శంకర్, డా. మహేష్, డా. గంగాధర్, డా.మినిగిరి రాము, డా. భీమ్ రావు, డా. విఠల్, ముజాయిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.