హైదరాబాద్ : స్టీల్ పైపుల తయారీ కంపెనీ హైటెక్ పైప్స్ తాజాగా క్వాలిఫైడ్ ఇన్స్‌ట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ద్వారా విజయవంతంగా రూ.500 కోట్ల నిధులు సమీకరించినట్టు తెలిపింది. అక్టోబర్7న ప్రారంభమైన క్యూఐపీని ఈ నెల 11న మూసివేసినట్టు వెల్లడించింది. ఇందులో రూ.800 కోట్లకు విలువ చేసే బిడ్లు వచ్చినట్టు తెలిపింది. ఈ క్యూఐపీలో మోతిలాల్ ఓస్వాల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ పండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎఫ్, జెఎం ఫైనాన్సీయల్ ఎంఎఫ్, ఎల్‌ఐసీ ఎంఎఫ్ తదితర సంస్థలు పాల్గొన్నట్టు తెలిపింది.