50 వేల చెక్కు అందజేత..

నవతెలంగాణ – డిచ్ పల్లి

తెలంగాణ ప్రభుత్వ పరంగా వికలాంగుల కోటాలో మంజూరైన 50వేల రూపాయల చెక్కు ను శనివారం ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ ఇందల్ వాయి గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ కు ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. మొబైల్ పాయింట్ సర్వీస్ కోసం 50 వేల రూపాయలు వికలాంగుల కోటాలో మంజూరైందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాములు నాయక్, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, బిఅర్ఎస్ రూరల్ ఎస్సీ సెల్ కన్వీనర్ పాశం కుమార్, సినియర్ నాయకులు అరటి రఘు, శ్రీధర్, కార్యదర్శి భారత్, విమల బాయి తదితరులు పాల్గొన్నారు.