
మండలంలోని కౌలాస్ నాళా ప్రాజేక్ట్ కు గురువారం ఉదయం ఆరుగంటల సమయం నాటికి ఎగువ నుండి 521 క్యూసెక్క్ ల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ ఏఈ రవిశంకర్ తెలిపారు. ఈ సంధర్భంగా ఏఈ మాట్లాడుతూ.. నెల రోజుల తరువాత ఇన్ ఫ్లో రావడం శుభశూచకమని అన్నారు. ప్రస్తుతం ముసురు వాన కురుస్తుండటంతో తెలంగాణతో పాటు ఎగున మహరాష్ట్ర, కర్ణాటక సరిహద్దులలో సమృద్దిగా వర్షాలు పడుతున్నాయని, గంటగంటకి నీరు వస్తుంటుందని ఆశాభావం వ్యక్త్యం చేశారు. ప్రస్తుతం పూర్థిస్థాయి నీటిమట్టం 458 మీటర్ల కు గాను 454.74 మీటర్లు నీటి మట్టం ఉందని తెలిపారు.