కార్మిక వర్గ విధానాలకు వ్యతిరేకం

– ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యమత్యమై ఉద్య మించాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు జి. సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికులు అనేక ఏండ్లుగా పోరాడి సాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా విభజించడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు జి. సంజీవ రెడ్డి 93వ జన్మదిన వేడుకలు ఆది వారం ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ డి చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నా ల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. కోదండరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సంజీవ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ విధానాలతో కార్మికులు, ప్రజలు ఐక్యం కాకుండా విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఈ విషయాల పట్ల కార్మికులు అప్రమత్తం కావా లని సూచించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ తెలంగాణ ఉపాధ్యక్షులు జనక్‌ ప్రసాద్‌, నల్లవెల్లి అంజిరెడ్డి, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు ఆదిల్‌ షరీఫ్‌, నాగన్న గౌడ్‌, ఉపేందర్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.