– అత్యధికంగా సికింద్రాబాద్‌లో 45 మంది పోటీి
– అత్యల్పంగా అదిలాబాద్ బరిలో 12 మంది
– పోటీ నుంచి తప్పుకున్న 100 మంది అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం లోకసభ బరిలో 526 అభ్యర్థులు పోటీలో మిగిలారు. ఈ మేరకు తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 17 పార్లమెంట్ నియోజక వర్గాలో పరిశీలన అనంతరం 625 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. ఉపసంహరణల చివరి రోజైన సోమవారం 100 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 15 మంది, భువనగిరిలో 12, మెదక్, నల్లగొండలో 9 మంది చొప్పున పోటీ నుంచి తప్పుకున్నారు. అత్యల్పంగా అదిలాబాద్, సికింద్రాబాద్‌లో ఒక్కరు, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్‌లో ఇద్దరు, నిజామాబాద్, చేవెళ్లలో ముగ్గురేసి చొప్పన తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. తుది జాబితా ప్రకారం అత్యధికంగా 5 స్థానాల్లో 40 మందికి పైగా పోటీలో ఉన్నారు.
సికింద్రాబాద్‌లో 45 మంది, ఆ తర్వాత మెదక్‌లో 44, చేవెళ్లలో 43, పెద్దపల్లిలో 42 మంది బరిలో మిగిలారు. రాష్ట్రంలోని17 పార్లమెంట్ నియోజక వర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌటింగ్,
ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.