రూ. 35.5 కోట్లు..541 పనులు…

– ఉపాధి హామి నిధులతో గ్రామాల్లో పనులకు ప్రతిపాదనలు..
– గ్రామాల్లో ప్రజలకు తీరనున్న  కష్టాలు..
– సీసీరోడ్లు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ  బిల్డింగ్ కోసం ఖర్చు చేయనున్న అధికారులు..
– మార్చిలోగా పనుల పూర్తికి యాక్షన్ ప్లాన్ సిద్దం..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
గ్రామ పంచాయతీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ఫండ్స్ వినియోగించనున్నారు.ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ఫండ్స్ లలో 40 శాతం మెటీరియల్‌కాంపోనెంట్‌గా శాశ్వత పనులు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. దీనితో జిల్లాలోని 23 మండలాల్లో రూ. 50 కోట్లు కాంపోనెంట్‌ఫండ్స్ అందుబాటులో ఉండగా మొదటి దశలో రూ. 35.5 కోట్ల పనులకు అనుమతించారు. ఈ ఫండ్స్ తో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో 541 పనులకు ఆమోదం తెలిపారు. ఈ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌, డీఆర్‌డీఏ, ఇంజినీరింగ్‌అధికారులను ఆదేశించడంతో గ్రామాల్లో పనులు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.పంచాయతీరాజ్‌ఇంజనీరింగ్‌అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టాల్సి ఉండగా  ఈ మేరకు వారు ఎస్టిమేషన్స్ సైతం సిద్ధం చేశారు.
ఎస్టిమేషన్స్ సిద్దం: ఉపాధి హామీ పథకంలో మంజూరైన ఫండ్స్ లకు సంబంధించి వర్క్స్ చేపట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు అందుకు సంబందించిన ఎస్టిమేషన్స్ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు  నియోజకవర్గాలలోని గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి, పరిపాలన పరమైన శాంక్షన్స్ తీసుకున్నారు.ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణంకు ప్రతిపాదనలు రాగా డ్రైన్స్, అంగన్‌వాడి బిల్డింగ్స్, పిహెచ్‌సీల ప్రహరి గోడల నిర్మాణం, గ్రామ పంచాయతీ  బిల్డింగ్ ల  నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాస్థాయి కమిటీలో కలెక్టర్  చైర్మెన్‌గా, జిల్లా పంచాయతీరాజ్‌ఇంజినీరు, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో మొత్తం రూ. 35.5 కోట్ల వ్యయంతో 541 వ్యర్క్స్ చేపట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా.ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాకు రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యా యి. అందులో ముందుగా రూ. 35.5 కోట్లతో 541 పనులను ఆమోదించారు. సూర్యాపేట  నియోజకవర్గంలో 127 పనులకు రూ.7 కోట్ల,  తుంగతూర్తి  నియోజకవర్గంలో 141 పనులకు రూ. 7.5  కోట్లు కేటాయించారు. అదే విదంగా కోదాడ నియోజకవర్గానికి 136 పసనులకు రూ. 10 కోట్లు, హుజూర్ నగర్‌నియోజకవర్గానికి 157 పనులకు గాను రూ. 11.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిని మండలాలు, గ్రామాల వారీగా పంపిణీ చేశారు. సూర్యాపేట, తుంగతూర్తి నియోజకవర్గాలలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనుండగా…. కోదాడ, హుజుర్‌నగర్‌నియోజకవర్గాలలో సీసీ రోడ్లతో పాటు డ్రైన్స్,  సైడువాల్లు, పిహెచ్‌సీ, అంగన్‌వాడిలకు సైడ్ వాల్స్ నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.  ఈ పనులను మార్చి 31 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫండ్స్ వెనక్కు పోయే అవకాశం ఉంది.సీసీ రోడ్లతో మారుతున్న గ్రామాల రూపు రేఖలు..
గ్రామాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గ డెవలప్ మెంట్ ఫండ్స్(ఏసీడీఎఫ్‌), ఉపాధిహామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి ఫండ్స్ మంజూరు చేస్తున్నారు. ఇవే కాకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ నిధులతో కూడా సీసీ రోడ్ల నిర్మాణం కొన్నాళ్ల నుంచి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇలా గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడం వల్ల గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి.
మార్చి 31లోపు పనులు పూర్తి చేస్తాం: జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ వేంకటేశ్వర రావు- సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఎస్ ఫండ్స్ రూ.35కోట్లతో 541 వర్క్స్ చేపట్టినమ్. మరో రూ. 15కోట్ల ఫండ్స్ తో మరి కొన్ని పనులను చేపడుతున్నాం. గ్రామాలలోని సి‌సి రోడ్లు, డ్రైనేజిలు, అంగన్ వాడి, గ్రామ పంచాయితీ  బిల్డింగ్స్ లను చేపడుతున్నాం. మార్చి 31వరకు పనులను పూర్తి చేస్తాం.