నీట్‌లో 56.41 శాతం ఉత్తీర్ణత

– మహారాష్ట్రకు చెందిన వేద్‌ సునీల్‌కుమార్‌ షిండే అబ్బాయిల్లో ప్రథమం
– రాజస్థాన్‌కు చెందిన ప్రచిత అమ్మాయిల్లో టాపర్‌
– నీట్‌ ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్‌ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)-2024 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. 24,06,079 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, గతనెల ఐదో తేదీన నిర్వహించిన నీట్‌ రాతపరీక్షకు 23,33,297 మంది హాజరయ్యారు. వారిలో 13,16,268 (56.41 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అబ్బాయిలు 10,29,198 మంది దరఖాస్తు చేయగా, 9,98,298 మంది పరీక్ష రాశారు. వారిలో 5,47,036 (54.80 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 13,76,863 మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తే, 13,34,982 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 7,69,222 (57.62 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 18 మంది ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేస్తే, 17 మంది పరీక్ష రాశారు. వారిలో పది (58.82 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. తెలంగాణ నుంచి 79,813 మంది దరఖాస్తు చేయగా, 77,849 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 47,371 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 66,522 మంది దరఖాస్తు చేస్తే, 64,931 మంది పరీక్ష రాశారు. వారిలో 43,858 మంది ఉత్తీర్ణత సాధించారు. మహారాష్ట్రకు చెందిన వేద్‌ సునీల్‌కుమార్‌ షిండే 99.9971285 పర్సెంటైల్‌ స్కోర్‌తో అబ్బాయిల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన ప్రచిత 99.9971285 పర్సెంటైల్‌ స్కోర్‌తో అమ్మాయిల్లో టాపర్‌గా ఉన్నారు.
నీట్‌ ఫలితాల వివరాలు
జెండర్‌ దరఖాస్తు హాజరు ఉత్తీర్ణత అబ్బాయిలు 10,29,198 9,98,298 5,47,036
అమ్మాయిలు 13,76,863 13,34,982 7,69,222
ట్రాన్స్‌జెండర్లు 18 17 10 మొత్తం 24,06,079 23,33,297 13,16,268