డీఎస్సీ పరీక్షకు 56 మంది అభ్యర్థుల గైర్హాజరు..

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
టీచర్ల రిక్రూట్మెంట్ కోసం గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షకు 56 మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. షిఫ్ట్ 1 లో నిర్వహించిన పరీక్షకు 185 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 154 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 31 మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. షిఫ్ట్ 2 లో నిర్వహించిన పరీక్షకు 185 మంది అభ్యర్థులకు గాను 160 మంది అభ్యర్థులు పరీక్ష కు హాజరయ్యారు. 25 మంది అభ్యర్థులు గైర్హాజరు అయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.