హైదరాబాద్ : పునరుత్పాదన రంగంలోని జిపి ఈకో సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ ఇన్సియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు విశేష స్పందన లభించింది. జూన్ 14న ప్రారంభ మైన ఈ ఇష్యూ బుధవారంతో ముగియగా.. ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 856.37 రెట్ల సబ్‌స్క్రిప్షన్ నమోదయ్యింది. రూ.30.79 కోట్ల నిధుల సమీకరణకు ఇష్యూకు రాగా.. ఏకంగా రూ.16,624 కోట్లకు బిడ్డింగ్స్ రావడం విశేషం. ధరల శ్రేణీని రూ.90-94గా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 32.76 లక్షల షేర్లను ఇష్యూలో విక్రయానికి పెట్టింది.