హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఈపీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కంపెనీ సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఎస్‌టీఈఎల్) 56 శాతం వీద్థితో రూ.16.76 కోట్ల నికర లాభాలు సాధించినట్టు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.10.69 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.204.93 కోట్లుగా ఉన్న ఆదాయం.. గడిచిన క్యూ3లో రూ.304.35 కోట్ల ఆదాయాన్ని సాధించింది.