చెన్నయ్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) లాభాలు 57 శాతం పెరిగి రూ.359 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.229 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ1లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగి రూ.897 కోట్లుగా చోటు చేసుకుంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.99 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే సమయం నాటికి 5.28 ఎన్‌పీఏలు నమోదయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు 1.93 శాతం నుంచి 0.59 శాతానికి తగ్గాయి.