27న 5కే రన్

– టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్
నవతెలంగాణ – సిద్దిపేట
 27 న సిద్దిపేట టూ టౌన్ పోలీస్, సిద్దిపేట రన్నర్స్ వారి ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించబడునని  సిద్దిపేట టూ- టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 27 న  ఉదయం 5 గంటలకు సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్ నుండి 5కే రన్ ప్రారంభమవుతుందని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నర్సాపూర్ ఎక్స్ రోడ్, వేములవాడ కమాన్, పత్తి మార్కెట్ యార్డ్, సిద్దిపేట టూ టౌన్ పిఎస్ మరియు వేములవాడ కమాన్ గ్రౌండ్ వరకు రన్నింగ్ నిర్వహించబడునని తెలిపారు. ఆసక్తిగల వారు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో  టూ టౌన్ ఎస్ఐ లు అమర్, విజయభాస్కర్, శ్రీరామ్ , పోలీస్ సిబ్బంది,   కౌన్సిలర్లు, నాయకులు వంగ తిరుపతి రెడ్డి, ధర్మవరం బ్రహ్మం, భూంపల్లి శ్రీహరి, గుడాల శ్రీకాంత్, సాకి ఆనంద్, మణిదీప్ రెడ్డి, అక్తర్ పటేల్, చంద్రం, రియాజ్, సత్తిరెడ్డి, రాజిరెడ్డి, జువ్వన కనకరాజు,  ఎర్రబోలు రాజిరెడ్డి, కర్ణాకర్ రెడ్డి, కోడూరు రాము పాల్గొన్నారు.