ప్రశాంతంగా ముగిసిన 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల (బాలికల) పాఠశాల ధర్మారం-బి లో ఆదివారం 2024-25 విద్యాసంవత్సరమునకు గాను టిఎస్ డ్లు అర్,టిటిడ్లుఅర్ టిఅర్ఈఐ, ఎంజెపిటిబిసిడ్లుఅర్ పాఠశాలలలో 5వ తరగతిలో ప్రవేశము కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్ష కేంద్రం నకు మొత్తం 480 మంది విద్యార్థులను అలాట్ చేయగ 449 మంది హాజరుకాగా 31 మంది హాజరు కాలేదని,ఈ పరీక్ష ప్రశాంతంగా ముగుసిందని ఈ పరీక్ష కేంద్రం  చీప్ సూపరింటెండెంట్ బి. సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.అదే విధంగా నిజామాబాద్ జిల్లాలోని (7) సాంఘీక సంక్షేమ గురుకుల పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగ మొత్తం 2904 మంది విద్యార్థులకు గాను 2746 (95.56%) మంది ఈ పరీక్షకు హాజరు కాగా 158 (5.44%) మంది గైర్హాజరయ్యారని, జిల్లా మొత్తంలో ఈ పరీక్ష ప్రశాంతముగా ముగిసిందని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త. బి. సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.ధర్మారం-బి పరీక్షా కేంద్రంలో పరీక్షా సజావుగా నిర్వహించడం కొసం స్క్వాడ్ గా పిశ్రీనివాస్, భవణి,ఫ్లైయింగ్ స్క్వాడ్ గా కల్యాణి,గోపి చంద్ లను నియమించడం జరిగిందని, వారు పరీక్షా కేంద్రంనకు సందర్శించి ఈ పరీక్షా నిర్వహణను పరిశీలించడం జరిగిందని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త బి.సంగీత  ఒక ప్రకటనలో తెలిపారు.