నవతెలంగాణ-శంషాబాద్
వివిధ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు సోమవారం పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.ఆరు కోట్ల విలువ చేసే బంగారం పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలువురు హార్డ్ వేర్ సామగ్రిలో మెర్క్యూరీ కోటెడ్ చైన్స్లా మార్చుకుని ఎయిర్పోర్టుకు బంగారం తీసుకు వచ్చారు. విశ్వసనీయ సమామాచారం మేరకు ఎయిర్పోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. 28 మందికి సంబంధించిన వివిధ రకాల కేసుల్లో 13.65 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.6.03 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.