వర్షాలకు 6 ఇల్లు ధ్వంసం…

నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డిలో 3, సుద్దాలం గ్రామాలలో3 నివాసపు ఇల్లు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను ధ్వంసం అయినట్లు తహసిల్దార్ శ్రీనివాస్ రావు మంగళవారం తెలిపారు. కోరట్ పల్లి, సుద్దాలం కులిపోఎ దశకు… డిచ్ పల్లి మండలం లోని కోరట్ పల్లి సుద్దాలం వేళ్ళె రాహదరిపై ఉన్న ఒక కల్వర్టు కులిపోఎ దశకు చేరుకుందని స్థానికులు తెలిపారు.గతెడాది ఇక్కడే కల్వర్టు కులిపోగ పైప్ లైన్ వేసి  వదిలారు.భారి వర్షాల నేపథ్యంలో పక్కనే ఉన్న చెరువు నిండి కల్వర్టు ద్వారా వేళ్తుందని ఇప్పటికే సగం కల్వర్టు పై ఉన్న మట్టి కోట్టుకు పోయిందని రాకపోకలు సాగించే వారు జాగ్రత్తగా ఉండాలని తహసిల్దార్ శ్రీనివాస్ రావు ప్రజలకు తెలిపారు.కల్వర్టు స్థితి గతులపై ఉన్నతాధికారులకు సమాచారం అందజేసినట్లు అయన వివరించారు.