జిల్లెలగూడ పోచమ్మ ఆలయం అభివృద్ధికి ఆరు లక్షల వితరణ

నవతెలంగాణ – మీర్ పేట్
మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ బిఆర్ఎస్ నాయకుల విజ్ఞప్తి మేరకు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి జిల్లెలగూడ పోచమ్మ ఆలయం అభివృద్ధికి ఆరు లక్షల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు కొత్త మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చాలవది రాజేష్, బొబ్బిలి కిరణ్ గౌడ్, మల్లెం నరేందర్ రెడ్డి, సప్పిడి యాదిరెడ్డి, కుంటల వల్లబ్ రాజు గౌడ్, మల్లెల విజయభాస్కర్ రెడ్డి, బొక్క అంజిరెడ్డి, కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.