6.83 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Retail inflation to 6.83 percentన్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 6.83 శాతంగా నమోదయ్యింది. ఇంతక్రితం జులైలో ఇది 7.4 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన నెలలో అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సూచీ 9.94 శాతానికి తగ్గిందని ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. 2023 జులైలో 11.51 శాతంగా చోటు చేసుకుంది. స్థూలంగా గ్రామీణ, పట్టణ ద్రవ్యోల్బణ సూచీలు వరుసగా 7.02 శాతం, 6.59 శాతంగా చోటు చేసుకున్నాయి. క్రితం జులైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 7.4 శాతానికి ఎగిసి.. 15 మాసాల గరిష్ట స్థాయి వద్ద చోటు చేసుకుంది. ముఖ్యంగా కూరగాయలు, అహారోత్పత్తుల ధరలు ఎగిసిపడ్డాయి. టమాట ధరలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిన విషయం తెలిసిందే.