బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 6 -7 తేదీలలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు బ్రాంచ్ నిర్వాహకులు శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 6వ తేదీ ఉదయం 10 నుండి 12 గంటల వరకు అన్ని ఫైనల్ ఇయర్ బీఎస్సీ లైఫ్ సైన్స్ , ఫిజికల్ సైన్స్ విద్యార్థులకు 7 వ తేదీన మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు అన్ని బి ఎ , బీకాం కాంబినేషన్ కోర్స్ విద్యార్థులకు కార్పొరేట్ ఇన్స్టిట్యూషనల్ ట్రైనర్ అర్ కృష్ణ ప్రసాద్ చేత కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రోగ్రాం లో ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ , క్రిటికల్ క్రియేటివిటీ థింకింగ్, పాజిటివ్ ఆటిట్యూడ్, లీడర్షిప్ , కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ మోటివేషన్ , తదితర అంశాల్లో నిపుణుల చేత నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఇతర వివరాలకు 7702345063 కు సంప్రదించాలని కోరారు.