6 గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమం

– కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం
నవతెలంగాణ-రామన్నపేట
రైతులకు రైతుబంధు ఇవ్వడంతో పాటు కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేస్తూ కూలీలకు సైతం నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి రూ12వేలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అందజేయనుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం తెలిపారు. సోమవారం మండలంలోని బాచుప్పల, సూరారం, బి తుర్కపల్లి, కుంకుడు పాముల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు వేముల వీరేషానికి ఘనంగా స్వాగతం పలికారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను వేముల వీరేశం ఈ సందర్భంగా అభ్యర్థించారు. చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మేనిఫెస్టో అమలు కమిటీ సభ్యులు చామల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మదర్‌ డైరీ మాజీ చైర్మన్‌ గంగుల కష్ణారెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా నాయకులు లోడంగి శ్రవణ్‌ కుమార్‌, మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, నాయకులు జినుకల ప్రభాకర్‌, గంగుల వెంకట రాజారెడ్డి, పున్న రమేష్‌, మందడి ప్రభాకర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, ఎండి జమీరుద్దీన్‌, చల్ల వెంకట్‌ రెడ్డి, నల్ల వెంకటరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, విష్ణు, సైదులు, మహమ్మద్‌ రెహాన్‌, జేల్లా వెంకటేష్‌, ఎండి అక్రమ్‌, తదితరులున్నారు.