నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికిరూ. 60 కోట్లు మంజూరు..

Nizamabad Urban Development. 60 crore sanctioned..– రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

– గతంలో కవిత ఎంపీగా నిజామాబాద్ కు చేసిన ఒక్క అభివృద్ధి పని లేదు
– నూడ చైర్మన్ కేశ వేణు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి పియుఎఫ్ ఐడీసీ ద్వారా రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్ నుడా చైర్మన్ కేశ వేణు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని డివిజన్లో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణాల కొరకు 60 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా అమృత్ స్కీం,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు రూ.400 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోని ప్రజలకు ఇచ్చిన హామీలలో దాదాపు 80% హామీలను పూర్తి చేయడం జరిగిందని, కానీ గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నిజామాబాద్ కు చుట్టపు చూపుగా వచ్చిన కవిత రాష్ట్రంలో నిజామాబాద్ అర్బన్ లో అభివృద్ధి జరగడం లేదని మాట్లాడుతున్నారని, గతంలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని అన్నారు.
కేవలం ముఖ్యమంత్రి కూతురుగా హోదను మాత్రమే అనుభవించిందని ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంసాగర్ ఫ్యాక్టరీ మూత పడిందని ఆ సమయంలో ఎంపీగా ఉన్న కవిత ఏ రోజు మాట్లాడలేదని ఆన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. అదే విధంగా బిజెపి ఎంపీ అరవింద్ తనకు మోడీతో దగ్గర సంబంధం ఉంది అని చెప్తున్నాడని, నిజామాబాద్ పార్లమెంటు లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకురాలేదని, కేవలం ప్రగల్బాలు పలకడానికి ఆరవీంద్ సరిపోతున్నాడని, ఇకనైనా ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంపు,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామని,దాదాపు 90 రైతులకు 2 లక్షలోపు రుణమాఫీ చేశామని అన్నారు.మరొక్క సారి కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధపు మాటలు పట్లడితే మహిళా కాంగ్రెస్ నాయకులు తరిమి కొడతారని కేశ వేణు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జావేద్ అక్రమ్,కార్పొరేటర్ క్కుద్దస్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,కార్పొరేటర్ రోహిత్,బీసీ సెల్ నగర అధ్యక్షులు నాగరాజు,ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు వినయ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్,లవంగ ప్రమోద్,మహిళా కాంగ్రెస్ నాయకులు పద్మ, అపర్ణ, శుభం, అయ్యూబ్, ఆకుల మహేందర్, సాయి కుమార్, హరూల్ ఖాన్, కుద్దస్, వాలి  తదితరులు పాల్గొన్నారు