నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వ హించిన ప్రజావాణికి మొత్తం 614 దరఖాస్తులు అందాయి. మైనార్టీ వెల్ఫేర్ శాఖకు 210, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణభివృద్ధి శాఖకు 112, విద్యుత్ శాఖకు 75, రెవెన్యూ శాఖకు 65, హౌం శాఖ కు 38, ప్రవాసి ప్రజా వాణికి 02, ఇతర శాఖలకు 112 దరఖాస్తులు అంది నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షు లు డాక్టర్ జి.చిన్నారెడ్డి ఈ కార్యక్రమం లో పాల్గొన్ని దరఖాస్తులు స్వీక రిం చారు. ప్రజా భవన్‌కు వచ్చిన వా రి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.