కన్వీనర్‌ కోటాలో 62,079 సీట్లు

– 137 ప్రయివేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు
– సీఎస్‌ఈ, అనుబంధ కోర్సుల్లోనే 30,807 సీట్లు
– నేటినుంచి ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 155 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 86,106 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 16 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో 4,713 సీట్లు, రెండు ప్రయివేటు వర్సిటీల్లో 1,302 సీట్లు కలిపి మొత్తం 6,015 సీట్లున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి 137 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలకు ఓయూ, జేఎన్టీయూ హైదరాబాద్‌, కేయూలు అనుబంధ గుర్తింపును ప్రకటించాయి. వాటిలో 80,091 సీట్లున్నాయి. ఓయూ పరిధిలో 14 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 8,210 సీట్లు, జేఎన్టీయూహెచ్‌ పరిధిలో 122 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 70,801 సీట్లు, కేయూ పరిధి లో ఒక కాలేజీలో 1,080 సీట్ల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో 155 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 62,079 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 137 ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల పరిధిలో 24,027 సీట్లు యాజమాన్య కోటాలో ఉండనున్నా యి. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), అను బంధ కోర్సుల్లోనే 30,807 సీట్లున్నాయి. ఇందులో సీఎస్‌ఈ కోర్సులో 15,897 సీట్లు, సీఎస్‌ఈ ఆర్టిఫిషి యల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ (ఏఐఅండ్‌ఎంటీ) కోర్సులో 7,854 సీట్లు, సీఎస్‌ఈ (డాటా సైన్స్‌) కోర్సులో 4,515 సీట్లు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూని కేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) కోర్సులో 9,734 సీట్లు, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ) కోర్సులో 3,854 సీట్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సులో 3,696 సీట్లు, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో 2,667 సీట్లు, సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో 3,087 సీట్లు ఉన్నాయి.
54,029 మంది స్లాట్‌ బుకింగ్‌
ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం 54,029 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపునకు వచ్చేనెల ఐదో తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. బుధవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల ఆరు వరకు ధ్రువపత్రాల పరిశీలన, ఎనిమిదో తేదీ వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు గడువుందని వివరిం చారు. ఇతర వివరాల కోసం www.://tseamcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఇంజినీరింగ్‌ కాలేజీలు, సీట్ల వివరాలు
విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు కన్వీనర్‌ కోటా వివరాలు
కాలేజీలు సీట్లు కాలేజీలు సీట్లు
1. ఓయూ 14 8,210 14 5,747
2. జేఎన్టీయూహెచ్‌ 122 70,801 122 49,561
3. కేయూ 1 1,080 1 756
మొత్తం 137 80,091 137 56,064
విశ్వవిద్యాలయ, అనుబంధ కాలేజీలు, ప్రయివేటు వర్సిటీలు 18 6,015
మొత్తం 155 62,079
ఎక్కువ సీట్లున్న ఇంజినీరింగ్‌ కోర్సుల వివరాలు
కోర్సు కోడ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రయివేటు కాలేజీల్లో
సీట్లు సీట్లు
సీఎస్‌ఈ 720 15,897
ఈసీఈ 660 9,734
సీఎస్‌ఎం 300 7,854
సీఎస్‌డీ 120 4,515
ఈఈఈ 600 3,854
ఐఎన్‌ఎఫ్‌ 240 3,696
సీఐవీ 480 3,087
ఎంఈసీ 480 2,667
ఏఐడీ — 1,554
సీఎస్‌సీ 60 1,344