స్టాక్‌ మార్కెట్లపై 65 శాతం ఇన్వెస్టర్లకు అవగాహన లేదు

– రిటర్న్‌లో 67 శాతం మంది విఫలం
– సామ్కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వెల్లడి
– ‘మిషన్‌-ఎస్‌ ద ఇండెక్స్‌’ ఆవిష్కరణ
హైదరాబాద్‌ : దేశీయ స్టాక్‌ మార్కెట్లలో 67 శాతం మంది ఇన్వెస్టర్లు రిటర్న్‌లు సాధించడంలో విఫలం అవుతున్నారని ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్‌ కంపెనీ సామ్కో వ్యవస్థాపకులు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) జిమీత్‌ మోడీ పేర్కొన్నారు. కొత్తగా తమ సంస్థ మిషన్‌- ఎస్‌ ద ఇండెక్స్‌ను విడుదల చేసిందన్నారు. భావితరపు క్యాపిటల్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (సిఆర్‌పి) ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను వెబ్‌, యాప్‌పై ఆవిష్కరించడం ద్వారా వ్యాపారులు, మదుపరులు తమ పెట్టుబడుల పనితీరు మెరుగు పరుచుకునేందుకు దోహదం చేయనుందన్నారు. గురువారం ఆయన వర్చ్యూవల్‌ సమావేశంలో మాట్లాడుతూ.. నీల్సన్‌ సర్వే ప్రకారం.. ”63 శాతం మంది మదుపరులకు తమ లక్ష్యం లేదా సూచీలను ఎలా చేరు కోవాలనే దానిపై ప్రణాళిక లేదు. 65 శాతం మంది మదుపరులకు తమ స్టాక్‌ మార్కెట్‌ రిటర్న్స్‌ పట్ల కచ్చితంగా అవగాహన లేదు. 77 శాతం మంది మదుపరులకు తాము స్ధిరంగా బెంచ్‌మార్క్‌ సూచీలను అందుకో వాలన్న అంశంపై అవగాహన లేదు. మిగిలిన 23 శాతం మంది మదు పరులకు బెంచ్‌మార్క్‌ సూచీ అందుకోవాలన్న అంశం పట్ల అవగాహన ఉంది. అయితే వీరిలో 50 శాతం మందికి బెంచ్‌మార్క్‌ సూచీలు ఏ విధంగా ఆ రాబడి సాధిస్తాయన్నది తెలియదు.” అని జమీత్‌ పేర్కొన్నారు. ”అధిక శాతం మంది భారతీయ మదుపరులు, వ్యాపారులు కనీసం బెంచ్‌మార్క్‌ రిటర్న్స్‌ను కూడా పొందలేకపోతున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. వీటిలో సరైన ట్రేడింగ్‌ వ్యవస్ధ, తప్పు పనితీరు కొలత, దురాశ, భయంతో కూడిన సమయాల్లో భావోద్వేగాలతో తీసుకునే చర్యలు, సలహాలు, ఫిన్‌ ఇన్ల్య్‌యర్స్‌పై అధికంగా ఆధారపడటం మొదలై నవి ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించడం కోసం ‘మిషన్‌-ఎస్‌ ద ఇండెక్స్‌’లో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.” అని జమీత్‌ తెలిపారు.