– పీఎంజీఎస్‌వై కింద 25 గూడెంలకు మంజూరు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) జన్‌మన్ పథకం ద్వారా రాష్ట్రానికి రూ. 66 కోట్లు మంజూరయ్యాయి. ఈనిధులు ఆదీవాసీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించనున్నారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణానికి వాడనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 25 గూడెంలకు ఈ నిధులను కేటాయించారు. గత ఏడాది కాలంగా ఈ ప్రతిపాదన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దగ్గర పెండింగ్‌లో ఉంది. ఎన్నికల అనంతరం ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చొరవ నేపథ్యంలో ఈ నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.