నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 681 దరఖాస్తులు అందాయని ప్రత్యేక అధికారి దివ్వ తెలిపారు. దరఖాస్తులను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, దివ్య స్వీక రించారు. రెవెన్యూ శాఖకు 69, పౌరసరఫరాల శాఖకు 132, విద్యుత్‌శాఖకు 87, హౌజిఓంగ్‌కు 232 దరఖాస్తులు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 31 ,ఇతర శాఖలకు సంబంధించి 130 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు.