బెంగళూరు : ఫిక్సుడ్ డిపాజిట్లపై తొమ్మిది నెలల కాల వ్యవధికి గాను వడ్డీ రేటును 7 శాతం నుంచి 7.5 శాతానికి పెంచినట్లు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. 12 నెలల కాల వ్యవధి ఎఫ్‌డిలపై 8.25 శాతం అందించనున్నట్లు పేర్కొంది. ఈ రెండింటిపైనా సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. స్వల్ప కాలిక కాల వ్యవధి కోసం అధిక వడ్డీ రేటును కోరుకునే ఖాతాదారుల కోసం తాము ఎఫ్‌డి రేట్లను సవరించామని ఆ బ్యాంక్ సిఇఒ సంజీవ్ నౌటియాల్ పేర్కొన్నారు.