నవతెలంగాణ- జక్రాన్ పల్లి
30.09.2023 నాడు మద్యాహ్నం సమయంలో మండలం లో ని తొర్లికొండ గ్రామంకు చెందినా వెల్మ బాల్ రెడ్డి తన ఇంటికి తాళం వేసి ఆర్మూర్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన మనవడిని చూసి రావడానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దొంగలు అతని ఇంటి తాళం పగులగొట్టి ఇంటి లోకి చొరబడి బీరువా లో దాచుకున్న 7 తులాల బంగారు ఆభరణాలు, కొంత వెండి మరియు కొంత నగదు దొంగిలించుకుపోయినారని జక్రాన్ పల్లి పోలిస్ లు తెలిపారు. ఇట్టి విషయంలో పిర్యాది వెల్మ బాల్ రెడ్డి ఇచిన పిర్యాది మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంబించనైనదిఅని పోలీసులు తెలిపారు.