– 6 తరగతిలో 57,133 ప్రవేశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 70,116 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. ఈ మేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లయ్య బట్టు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల ఆరు నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఆరో తరగతిలో 57,133 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని వివరించారు. వారిలో ప్రయివేటు స్కూళ్ల నుంచి 9,117 మంది సర్కారు బడుల్లో చేరారని తెలిపారు.
ఎనిమిదో తరగతిలో ఇప్పటి వరకు 8,820 మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. ప్రయివేటు స్కూళ్ల నుంచి 1,196 మంది ప్రవేశం పొందారని వివరించారు. తొమ్మిదో తరగతిలో 2,814 మంది విద్యార్థులు చేరారని తెలిపారు. 539 మంది ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రవేశం పొందారని పేర్కొన్నారు. ఇతర తరగతుల్లో 8,220 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,75,799 మంది విద్యార్థులకు ఒక జత యూనిఫారాలను అందించామని పేర్కొన్నారు. 21,73,533 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, 11,65,748 మంది విద్యార్థులకు నోట్‌పుస్తకాలను పంపిణీ చేశామని వివరించారు. ఇప్పటి వరకు 4,33,337 మంది విద్యార్థులకు వర్క్ బుక్స్ ఇచ్చామని తెలిపారు.