
ఘనంగా శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల 71 వ వార్షికోత్సవం ప్రారంభోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ్ ముతాలిక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు మొదటి సంవత్సరం నుండి ఆరో సంవత్సరం విద్యార్థి విద్యార్థులచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక గాత్రం, వీణ, తబలా, కర్ణాటక వయోలిన్, మృదంగం, కర్ణాటక గాత్రం, హిందూ స్థాని గాత్రం, కూచిపూడి, పేరిణి నృత్యాలతో విద్యార్థులు తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కళాశాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్ది, కళాశాల విద్యార్థుల ప్రదర్శనలతో కళాశాల ఆవరణమంతా కొలహాలం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శన చూసి మురిసిపోయారు. గతంలో ఎన్నడు ఇలాంటి కల ప్రదర్శనలు చూడలేదని ఈ మార్పుతో తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. వందలాదిగా విద్యార్థుల తల్లిదండ్రులు రావడంతో కళాశాల ప్రాణంగామంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధాన ఆచార్యులు విశ్వనాథ్, విశ్రాంత వీణ అధ్యాపకులు ఆనంద రాజ్యలక్ష్మి, విశ్రాంత భరత నాట్యం అధ్యాపకులు అయ్యంగారి విజయదుర్గ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లావణ్య లత, టీవీ రవికాంత్, కే అనిల్ కుమార్,పి వీ రమణమూర్తి, ఇందిరా హేమ, శ్వేత, రాజగోపాల చారి, జయలక్ష్మి, రవీందర్, రాజు పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.