జిల్లాలో 73.15 శాతం పోలింగ్..

– ప్రశాంత వాతావరణంలో  పోలింగ్ నిర్వహణ
– అన్ని కేంద్రాల్లో పటిష్ఠ భద్రత
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో శాసన మండలి పట్టభద్రుల  ఎన్నికల పారదర్శకంగా  చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  ఎస్. వెంకట్రావ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన వీడియో మానేటరింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని డివిజన్లలో ఎన్నికల నిర్వహణలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 71 కేంద్రాల్లో   ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందని అన్నారు.జిల్లాలో జరిగిన ఓట్ల వివరాలు మొదటి రౌండ్ లోపురుష ఓట్లు 4258, మహిళ ఓట్లు 1570 పోల్ కాగా  11.32 శాతం నమోదు,రెండో రౌండ్ లో పురుష ఓట్లు 10813, మహిళ ఓట్లు 5290 పోల్ కాగా 31.27 శాతం నమోదు,  మూడో రౌండ్  లో పురుష ఓట్లు 17968, మహిళల ఓట్లు  9220 పోల్ కాగా52.80  శాతం నమోదు , 4వ రౌండ్ లో పురుష ఓట్లు 24142, మహిళ ఓట్లు 12225 పోల్ కాగా 70.62 శాతం నమోదు అలాగే జిల్లాలో పురుషుల ఓట్లు 25447, మహిళల ఓట్లు 12222 మొత్తం 37,669 పోల్ కాగా 73.15 శాతం ఓటింగ్ నమోదు అయ్యిందని   కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ తదుపరి ఆయా నియోజక వర్గాల పరిధిలోని గల పోలింగ్ కేంద్రాల నుండి  పోలింగ్ బాక్సులను  సంబంధిత  ఏ.ఆర్.ఓ ల ఆధ్వర్యంలో  సెక్టార్ అధికారులు సమక్షంలో పటిష్ఠ భద్రత నడుమ 16 రూట్ల వాహనాల ద్వారా కలెక్టరేట్ లోని ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి తదుపరి నల్గొండ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ లలో పోలింగ్ బాక్సులను భద్ర పర్చడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, అదనపు యస్.పి నాగేశ్వర రావు, ఆర్.డి.ఓ వేణుమాధవ్, తహశీల్దార్లు, సెక్టార్ అధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, తదితరులు పాల్గొన్నారు.