ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలు..

నవతెలంగాణ-గోవిందరావుపేట
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలను శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పైడాకుల అశోక్ హాజరై వైయస్ చిత్రపటానికి పూలమాల వసి ఘనంగా నివాళులు అర్పించి  కేక్ కట్ చేసి కార్యకర్తలు పంచుకున్నారు. దర్భంగా అశోక్  మాట్లాడుతూ మహానేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్  రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు అమోఘం అని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన రూపొందించిన పథకాలు దేశానికే దిక్సూచీల మారాయని, ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ పథకం, రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల పంట రుణమాఫీ, 104, 108 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజ్ రీ-ఇంబార్సుమెంట్ పథకం ద్వారా పేదలకు ఉన్నత విద్యను అందించడం, అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇందిర జల ప్రభ ద్వారా పేదలకు బోర్లు వేయించడం లాంటి అత్యున్నత పథకాలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచి, దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడిగా మన్ననలు పొందాడని కొనియాడారు. ఆయన వ్యూహాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రణాళిక బద్దంగా చేసిన ప్రతి ఒక్క పథకం విజయవంతం అయి పేదల పాలిట పెన్నిధి వై.ఎస్.ఆర్. గారు అయ్యారని అన్నారు. ఇవ్వాళ మహానేత వై.ఎస్.ఆర్.  74వ జయంతి సందర్భముగా  మా ఘన నివాలులు అర్పిస్తున్నామని అశోక్  అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, ఎంపీటీసీ చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య రాజు, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మడ్డాలి నాగమణి, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, సర్పంచులు లావుడియా లక్ష్మి – జోగ నాయక్, భూక్య సుక్య, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, జంపాల చంద్రశేఖర్, గోపిదాసు వజ్రమ్మ, సూదిరెడ్డి జయమ్మ, పులుసం లక్ష్మి, చొప్పదండి వసంత, పంగ శ్రీను, దేపాక కృష్ణ, యణమద్దిని శ్రీనివాస్, పొన్నం సాయి, దాసరి సాహిత్, జనగాం శ్యామ్, పెండెం తేజ, మిరియాల కృష్ణ, వేల్పుల సాంబయ్య, రమేష్, ఎట్టి ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.